ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు - awareness on national voters' day at visakha

విశాఖ జిల్లా చోడవరంలో ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉషోదయ డైట్ కళాశాలలో జరిగిన ఈ సదస్సులో ఓటు ప్రాధాన్యత, నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

awareness program on national voters' day
ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు

By

Published : Jan 23, 2021, 6:04 PM IST

జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో విశాఖ జిల్లా చోడవరంలోని ఉషోదయ డైట్ కళాశాలలో ఓటు హక్కుపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కుపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు నమోదు, ఓటర్లకు ఉన్న ప్రాధాన్యతపై ఎన్నికల అధికారులు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సుకు డైట్ కళాశాల ప్రిన్సిపల్ మూర్తి సమన్వయకర్తగా వ్యహరించారు.

ABOUT THE AUTHOR

...view details