విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని వెల్లంకి, నీలంపేట, ఎన్.కొత్తూరు గ్రామాల్లో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న దాదాపు 220 పేద కుటుంబాలకు తెదేపా నేతలు సరకులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం తేదేపా ఇంఛార్జి గవిరెడ్డి రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులతో ఇంటింటికీ పర్యటించి వస్తువులను అందించారు.