ప్రైవేట్ లెక్చరర్లకు నిత్యావసర సరకుల పంపిణీ - vishakapatnam latest update
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు నర్సీపట్నం మండలంలో ప్రవాసాంధ్రులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ప్రైవేట్ లెక్చరర్లకు నిత్యావసర సరకుల పంపిణీ
విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు సుంకర కోటిపల్లి నాయుడు దంపతులు సుమారు 20 మంది లెక్చరర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 1500 రూపాయల విలువ చేసే సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డివిజన్ ప్రైవేటు లెక్చరర్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, రావికమతం, నాతవరం, రోలుగుంట మండలాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి