విశాఖ జిల్లా మాల్కాపురంలోని కరోనా షెల్టర్ జోన్లో వలస కార్శికులను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు పరామర్శించారు. అక్కడి వారికి అందే సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విశాఖ ఎంపీ సత్యనారాయణతో కలిసి ఆయన పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలు వాటిని తీసుకునేందుకు గుంపులు గుంపులుగా తరలివచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా గుమికూడడం విమర్శలకు తావిచ్చింది.
మంత్రి సరుకులు అందించారు.. ప్రజలు గుంపులుగా తీసుకున్నారు - vegetables distribution news in visakhapatnam district
కరోనా నియంత్రణకు వ్యక్తిగత దూరం ఒక్కటే మార్గమని భావించి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అయితే కొన్ని చోట్ల సరుకుల పంపిణీ పేరుతో నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదు. విశాఖ జిల్లా మాల్కాపురంలోని కరోనా షెల్టర్ జోన్లో మంత్రి అవంతి ఎంపీ సత్యనారాయణతో కలిసి నిత్యావసరాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తీసుకునే క్రమంలో ప్రజలు గుంపులుగా రావడం విమర్శలకు తావిచ్చింది.
నిత్యావసర సరుకులు పంపిణీ