విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని ఎరుకువాని పాలెం, గొర్లివాని పాలెం, రాజు పాలెం గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ నిత్యావసర సరకులు అందజేశారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే అర్జీలు పరిష్కరించేలా... సీఎం జగన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని రత్నాకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నిత్యావసర సరకులు అందించేందు... వైకాపా నాయకుడు కొణతాల భాస్కర్ రావు ఆర్థిక సాయం చేశారు.
వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి నిత్యావసరాలు అందజేత - visakha district news
విశాఖ జిల్లా వల్లూరులో ప్రజలకు సేవలు అందిస్తున్న వార్డు వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి వైకాపా నేత దాడి రత్నాకర్ చేతుల మీదుగా నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
![వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి నిత్యావసరాలు అందజేత Essential Commodity Delivery Program for Ward Volunteers and Secretariat Staff at Vallur Villag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7731877-579-7731877-1592886653611.jpg)
వార్డు వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి నిత్యావసరాలు అందజేత
ఇవీ చదవండి:బడులు లేక విద్యార్థుల జీవనశైలిలో మార్పులు