భారీ వర్షాల కారణంగా తమ గ్రామంలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని విశాఖ జిల్లా నాతవరం మండలం ఎర్రంపేట గ్రామ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వర్షపు నీరు ప్రవహించకుండా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు.
దీనివల్ల గ్రామంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులకు వినతి పత్రం అందించారు.