ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Covid Effect: ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే.. మరో ముప్పు తప్పదు!

కొవిడ్ విజృంభణ వేళ చికిత్స కోసం వినియోగించిన వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తాయని పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర వర్థాలను నిర్లక్ష్యంగా వదిలేస్తే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

'కొవిడ్ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పు'
'కొవిడ్ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పు'

By

Published : Jun 6, 2021, 6:39 AM IST

'కొవిడ్ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పు'

కొవిడ్ తగ్గుముఖం పడుతున్నా సమయంలో ఆస్పత్రుల్లో చికిత్స వ్యర్థాలపై దృష్టి పెట్టాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. కొవిడ్ చికిత్సలో వినియోగించిన మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర సామగ్రితో పర్యావరణ ముప్పు తప్పదని అంటున్నారు. ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా వదిలేయటం వల్ల ప్రజలకు హాని కలుగుతుందని చెబుతున్నారు.

కొవిడ్ వ్యర్థాలతో నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యర్థాల నిర్వహణ సమర్థంగా నిర్వహంచాలని కోరుతున్నారు.వైద్యారోగ్యశాఖ స్పందించి...కొవిడ్ వ్యర్థాలతో పర్యావరణ హాని కలగకుండా చూడాలని పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details