ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యావరణాన్ని కాపాడుదాం.. కాలుష్యాన్ని తరిమేద్దాం

కాలుష్యాన్ని అరికట్టాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ హరి నారాయణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.

vsp

By

Published : Jun 5, 2019, 4:58 PM IST

పర్యావరణాన్ని కాపాడుదాం-కాలుష్యాన్ని తరిమేద్దాం
పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ ఆవరణలో మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు. ఓ వైపు విశాఖ నగరంలో పెరుగుతున్న పరిశ్రమల కాలుష్యం భయపెడుతుంటే.. మరోపక్క వాహనాల వినియోగం ద్వారా వాయు కాలుష్యం పెరిగిపోతోందని కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా ఒక్కో మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details