Entrepreneur Conclave and Meet programme : విశాఖ ఐటీ హిల్, ఫ్లూయిట్ గ్రిడ్ హాల్‌లో ఎంట్రప్రెన్యూర్ కాంక్లేవ్ అండ్ మీట్ కార్యక్రమం జరిగింది. విశాఖకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ సంస్కరణలు దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాయన్నారు. అందుకే మనం దేశం 5 వ ఆర్థిక ప్రగతి దేశంగా ఉన్నామన్నారు. ఇదే కొనసాగిస్తే మూడో స్థానంలోకి వస్తామన్నారు. ఖచ్చితంగా మూడో పెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ భక్తి అంటే సరిహద్దులు కాదని దేశ ప్రజలు ఒకరికి ఒకరు పరస్పరం సహకరీంచుకోవాలని అన్నారు. ప్రకృతి, పర్యవరణాన్ని కాపాడుకోవాలని ఇప్పుడు పర్యవరణాన్ని పాడు చేస్తున్నారని.. నదులను, నీటి వనరులను పాడు చేస్తున్నారని అన్నారు. అక్రమ మార్గంలో వ్యాపారం చేసిన వారి పట్ల చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు. రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తారు. నాయకుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడని అన్నారు. త్వరలో జీ20 ఫోరమ్ సదస్సు నిర్వహించుకుంటున్నామని ప్రపంచమంతా ఒకే కుటుంబంలా ఉండాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మాట్లాడుతూ ఎన్నో దండయాత్రలు తరవాత మనల్ని మనం పాలించుకుంటున్నాము. అయిన గొప్ప దేశంగా ఎదుగుతున్నామన్నారు. కోవిడ్ సమయంలో మన దేశం ప్రపంచానికి మందులు అందించిందని అన్నారు, ఆత్మ నిర్భర్ భారత్ గా ఈరోజు మనమే యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు తయారు చేస్తున్నామన్నారు. కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కలిగి ఉండాలని.. అలాంటి సీఎస్ఆర్ నిధులతో విశాఖ పబ్లిక్ లైబ్రరీ గొప్పగా తయారు అయిందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ అనేది ఒక మంచి సూచికని, ఆ సూచికలను బట్టి మంచి వ్యాపార అవకాశాలు వస్తున్నాయి.