ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్యాక్రాంతమవుతున్న దేవాదాయ 'దుకాణాలు సీజ్' - panduranga swami temple shops seized by officials

విశాఖ జిల్లా పాండురంగ స్వామి దేవస్థానానికి చెందిన దుకాణాలు అన్యాక్రాంతంపై.. వచ్చిన ఫిర్యాదులతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుకాణదారులు అక్రమాలు చేస్తున్నట్టు గుర్తించిన షాపులను సీజ్ చేశారు.

seized shops
తనిఖీల్లో అధికారులు

By

Published : Dec 22, 2020, 5:13 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట పాండురంగ స్వామి దేవస్థానానికి చెందిన దుకాణాలను జిల్లా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శాంతి సీజ్ చేశారు. ఇక్కడి దుకాణాలు 2005 సంవత్సరం నుంచి చేతులు మారుతున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేశారు.

దేవాదాయశాఖ నుంచి దుకాణాలు పొందిన యజమానులు.. వాటిని వేరే వ్యక్తులకు ఇచ్చి అదనపు అడ్వాన్స్ లు, అద్దెలు వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. యజమానులు దేవాదాయ శాఖకు నామమాత్రపు అద్దెలు చెల్లిస్తూ.. షాపులు లీజుకు తీసుకున్న వారి వద్ద నుంచి భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారని ఎసీ తెలిపారు. దేవాదాయ శాఖ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details