ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏవోబీలో ఎదురుకాల్పులు... మవోయిస్టు మృతి - Andhra Orissa border news

విశాఖలోని.. ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు పోలీసుల‌కు ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ సంఘ‌ట‌న‌లో ఒక మావోయిస్టు నాయ‌కుడు మృతి చెంద‌గా, ఒక ద‌ళ స‌భ్యుడు పోలీసులు ముందు లొంగిపోయాడు.

ఏవోబీలో మావోయిస్టుల‌కు పోలీసుల‌కు మధ్య ఎదురుకాల్పులు... ఒకరు మృతి
ఏవోబీలో మావోయిస్టుల‌కు పోలీసుల‌కు మధ్య ఎదురుకాల్పులు... ఒకరు మృతి

By

Published : Nov 26, 2020, 9:26 PM IST

విశాఖ ఏజెన్సీ ఏవోబీలోని క‌టాఫ్ ఏరియా జంత్రి ప్రాంతంలో మావోయిస్టులు సంచ‌రిస్తున్నార‌నే స‌మాచారంతో ఆంధ్రా గ్రేహౌండ్స్, ఎస్‌వోజీ పోలీసులు ఉమ్మ‌డిగా గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హించారు. గురువారం మ‌ధ్యాహ్నం తోటగూడా అట‌వీ ప్రాంతంలో గాలింపులు జ‌రుపుతున్న పోలీసుల‌కు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువైపులా ఎదురుకాల్పులు జ‌రిగాయి.

సుమారు 45 నిమిషాలుపాటు జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందగా, మరొకరు లొంగిపోయారు. మృతుడు మావోయిస్టు ఏరియా క‌మిటీ సభ్యుడు, మిల‌టరీ ప్లాటూన్ ఇన్‌చార్జి కిషోర్‌గా గుర్తించారు. ఘటనాస్థలిలో ఎస్​ఎల్​ఆర్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త‌ప్పించుకున్న మావోయిస్టులు కోసం గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి

విశాఖ జిల్లాలో నివర్​ తుపాన్​ ప్రభావం

ABOUT THE AUTHOR

...view details