ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వలస కూలీలకు ఉపాధి కల్పించాల్సిందే' - ఎంపిడివో శ్యామ్

విశాఖ జిల్లా చోడవరంలో అస్టిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జె.మణికుమార్.. ఏపీవోలతో సమావేశం నిర్వహించారు. వలస కూలీలకు జాబ్ కార్డులు ఇచ్చి ఉపాధి హామీ పధకం ద్వారా పనులు కల్పించాలని ఆదేశించారు.

vishaka district
వలస కూలీలకు ఉపాధి పనులు

By

Published : May 20, 2020, 8:43 AM IST

లాక్ డౌన్ వల్లన ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు జాబ్ కార్డులు ఇవ్వడమే కాక.. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని అస్టిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జె.మణికుమార్.. అధికారులను ఆదేశించారు. చోడవరం మండల పరిషత్ కార్యాలయంలో ఏడు మండలాల ఉపాధి హామీ పథకం ఏపీవోలతో ఆయన సమావేశమయ్యారు.

గ్రామాల్లోకి వచ్చిన వలస కూలీలందరికి ఉపాధి చూపించాల్సిందేనని స్పష్టం చేశారు. చోడవరం క్లస్టర్ లోని ఏడు మండలాల్లో 51 గ్రామాల్లో 150 మంది రైతులను గుర్తించి 185.54 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామని చెప్పారు. 185 ఎకరాల లక్ష్యాన్ని పెంచాలని ఏపీవోలకు అదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్యామ్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details