ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగాలిప్పిస్తామని మోసం.. న్యాయం చేయాలని బాధితుల ఫిర్యాదు - Employment fraud news

ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు తీసుకుని.. చివరికి తమపైనే దాడి చేశారని కొందరు విద్యార్థులు విశాఖలో పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై గతంలోనూ ఫిర్యాదులు అందాయని.. పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Employment fraud
ఉద్యోగాలిప్పిస్తామని మోసం

By

Published : Jan 26, 2021, 12:33 PM IST

ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకుని తిరిగి అడిగినందుకు దాడి

సాఫ్ట్​వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని, మోసం చేసి.. తిరిగి తమపైనే దాడి చేశారంటూ కొంతమంది విద్యార్థులు విశాఖలో పోలీసులను ఆశ్రయించారు. ఎన్​ఏడి కూడలి కాకానినగర్​ వద్ద యూఎస్​ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్​ సంస్థ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటన చేసింది. అది చూసి ఉద్యోగం​ కోసం వెళ్లిన ఒక్కొక్కరికి చేత రూ.2,500 చొప్పున కట్టించుకున్నారు. కానీ.. నెలలు గడుస్తున్నా ఉద్యోగలివ్వలేదు.

తాము కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఓ యువతి.. ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లి అడిగినట్టు చెప్పింది. వారు తనను గదిలో బంధించి.. దాడి చేసి.. గాయపరిచినట్టు ఎయిర్​పోర్ట్ పోలీస్​స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన లాగే వందలాది విద్యార్థులు డబ్బులు కట్టి మోసపోయారని తెలిపింది. న్యాయం చేయాలని కోరుతూ.. కొంతమంది బాధితులు పోలీసులను కోరారు. ఇదే సంస్థపై గతంలోనూ ఫిర్యాదులు అందాయని.. పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details