ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. తిరుమలకు ఉద్యోగుల పాదయాత్ర

Visakha Steel Plant workers: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ యాత్ర చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన వాల్తేరులో ప్రారంభమైన యాత్ర గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ మనసు మార్చి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా చూడాలని తిరుమలకు యాత్ర చేస్తున్నామని ఉద్యోగులు రామారావు, విష్ణుశయన బాబు తెలిపారు.

Visakha Steel Plant workers
విశాఖ ఉక్కు ఉద్యోగులు తిరుమలకు పాదయాత్ర

By

Published : Dec 28, 2022, 3:07 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తిరుమలకు పాదయాత్ర

Steel Plant workers Tirumala Padayatra: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను నిలిపివేయాలని అక్కడ కార్మికులు రెండేళ్లకుపైగా ఉద్యమం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇద్దరు కార్మికులు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలంటూ.. వెంకటేశ్వరస్వామిని వేడుకునేందుకు నరహరిశెట్టి విష్ణు శయనబాబు, గంటల రామారావు పాదయాత్ర చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర: విశాఖ నుంచి తిరుమలకు చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. వీరిద్దరూ 32ఏళ్లుగా స్టీల్‌ ఫ్లాంట్‌లో పని చేస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రవేటీకరణ చేయటానికి వ్యతిరేకంగా ఉద్యోగులంతా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 680రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయడం లేదు. దీంతో ఇద్దరు కార్మికులు ఈనెల 17వ తేదీ శనివారం ఉదయం విశాఖ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు.

'ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మనస్సును మార్చి స్టీల్‌ప్లాంట్‌ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంటు సభ్యులతో సంతకాలు సేకరణతో సరిపడితే ఎలాగా. విశాఖస్టీలు ఏపీకి మణిహారంలాంటిది. ఇలాంటి ప్లాంట్‌ కోస్తాతీర ప్రాంతంలో ఎక్కడాలేదు. జాతీయస్థాయిలో విశాఖ ఉక్కుకు గుర్తింపు ఉంది. దీనిని ప్రభుత్వరంగంలో కొనసాగిస్తే దేశానికే గర్వకారణంగా నిలుస్తుంది. ప్లాంట్‌ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో లభిస్తున్నాయి. ఇంత పెద్ద ప్లాంట్‌ని ప్రవేటీకరణ చేస్తామంటే మనస్సు అంగీకరించక తిరుమలకు పాదయాత్ర ప్రారంభించాం.'- విష్ణు శయనబాబు, గంటల రామారావు స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు

స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 32మంది ప్రాణత్యాగం: విశాఖ స్టీలు ప్రభుత్వ రంగంలో ఉండటంవల్ల కరోనా సమయంలో ఏపీ, తెలంగాణా, మహారాష్ట్ర, ఛత్తీస్​గడ్​ రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరా చేసి వందలమంది ప్రాణాలను కాపాడిందని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 32మంది ప్రాణత్యాగం చేశారని, 16వేల 500మంది రైతులు భూముల్నిచ్చారని తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని సీఎం కాపాడతారని ఆశిస్తూ తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని కూర్మన్నపాలెం నుంచి తిరుమలకు 750కిలోమీటర్లు ఉంటుంది. రోజుకి 35కిలోమీటర్లు చొప్పున పాదయాత్ర చేస్తున్నారు. జనవరి మొదటి వారానికి తిరుమల సన్నిధికి చేరుకోవాలని భావిస్తున్నట్లు కార్మికులు వివరించారు.

పలువురి సంఘీభావం: విశాఖ నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న ఉక్కు పరిశ్రమ కార్మికులకు మార్గమధ్యలో పలువురు సంఘీభావం తెలియజేశారు. కేంద్రం ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలంటూ.. కార్మికులతో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలోనే ప్లాంటు కొనసాగేలా శ్రీవెంకటేశ్వరస్వామి దీవించాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details