ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోవిడ్ నిబంధనలు పాటించలేదని ఉద్యోగుల ఆందోళన - చోడవరంలో సమావేశం

విశాఖపట్నం జిల్లా చోడవరంలో గ్రామ సచివాలయ అవగాహన కార్యక్రమ నిర్వహణ తీరుపై... ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా కనీస ఏర్పాట్లు చేయకపోవటంపై మండిపడ్డారు.

Employees' concern that  did not follow Kovid rules in meeting at chodavarm vizag district
కొవిడ్ నిబంధనలు పాటించలేదని ఉద్యోగుల ఆందోళన

By

Published : Sep 15, 2020, 6:51 AM IST

విశాఖపట్నం జిల్లా చోడవరంలో గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చోడవరం, మాడుగుల క్లస్టర్స్ ఇన్విజిలేటర్లు, సూపర్​వైజర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరయ్యారు.

సమావేశ నిర్వహణలో కోవిడ్ నిబంధనలు పాటించలేదంటూ అక్కడికి హాజరైన వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు లేవని.. తామంతా కిక్కిరిసి కూర్చోవలసిన పరిస్థితి ఉందని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details