మద్యం తాగి విధులకు తరచు విధులకు గైర్హాజరు అవుతున్న ఓ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. విశాఖ పాడేరు ఏజెన్సీ హుకుంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సహాయకుడిగా పని చేస్తున్న కామరాజు తరచూ మద్యం తాగి విధులకు డుమ్మా కొడుతున్నాడు. కొన్నిసార్లు మద్యం మత్తులో అందరితో వాగ్వాదానికి దిగుతున్నాడు. ఈ విషయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితో వైద్య అధికారిణి ప్రస్తావించారు. గతంలో చాలాసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. తీరు మారకపోవడంతో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ స్పందించి హెల్త్ అసిస్టెంట్ కామరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మద్యం తాగుతూ విధులకు డుమ్మా, ఉద్యోగి పై వేటు - ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తాజా వార్తలు
విశాఖ పాడేరు ఏజెన్సీ హుకుంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సహాయకుడుగా పని చేస్తున్న కామరాజు తరచూ మద్యం తాగి విధులకు డుమ్మా కొడుతున్నాడు. షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. తీరు మారకపోవడంతో అతడిని సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీవో ఉత్తర్వులు జారీ చేశారు.
హుకుంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగి సస్పెన్షన్