విశాఖ పాడేరు ఏజెన్సీ మార్గాల్లో లాక్డౌన్ ప్రకటనతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లకుండా రహదారులకు అడ్డుగా అడుగడుగునా చెట్లు, బండలు రాళ్లు పేర్చి రాకపోకలను కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర రవాణాకు, అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పాడుతుంది. ఏవరికి వారే స్వచ్ఛందంగా లాక్డౌన్లో పాల్గొనాలని, ఇలాంటి ఏర్పాట్లు చేయవద్దని అధికారులే ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గ్రామాల్లోకి రాకుండా కంచెలు.. నిత్య, అత్యావసరాలకు అడ్డంకులు - visakha paderu agency latest news update
ప్రపంచమంతా కరోనా కలకలం కొనసాగుతోంది. దేశంలోని మారు మూల గ్రామాల్లో సైతం రాకపోకలపై ఆంక్షలు విధించారు. కొన్ని ప్రాంతాల్లో యువత అత్యుత్సాహంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఇబ్బందులు తప్పడం లేదు. రహదారులకు కంచెలు అడ్డువేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
విశాఖ మన్యంలో నిత్యా, అత్యావసర సేవలకు అడ్డంకులు
నిత్యావసర సరుకులు అందించే జీసీసీ వాహనాలు, అంబులెన్సులు, పాల వ్యాన్లు ఆయా గ్రామాలకు చేరుకోవడం లేదు. జి.మాడుగుల మండలం గడుతూరు వెళ్లే ఘాట్ రోడ్ మార్గంలో గిరిజన కార్పొరేషన్ ద్వారా రేషన్ డిపోలకు వెళ్లే వాహనాలు నిలిచిపోతున్నాయి. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ రహదారులపై అడ్డంకులు తొలగించి వైద్య సేవలు, నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవీ చూడండి...
ఆశతో నడుస్తున్నాం... కానీ ఏమవుతుందో..?'
TAGGED:
విశాఖ పాడేరు వార్తలు