ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాస్తుదోషం ఉందంటూ.. ప్రభుత్వం నిధులతో వేసిన సీసీ రోడ్డు తొలిగింపు

గ్రామీణ ఉపాధి పథకంలో వేసిన రోడ్డును వాస్తుదోషం నెపంతో తొలగించిన ఘటన విశాఖ జిల్లా ఆనందపురం మండలం భీమందోపాలెంలో చోటు చేసుకుంది. తమకు ఎదురు లేదనుకున్న స్థానిక చోట నాయకులు ప్రభుత్వ నిధులతో వేసిన సీసీ రోడ్డును రాత్రికి రాత్రికే తొలిగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Elimination of government-funded CC road
వాస్తుదోషం నెపంతో సిమెంట్ రోడ్డు తొలిగింపు

By

Published : Oct 30, 2020, 12:02 PM IST

వాస్తుదోషం ఉందంటూ ప్రభుత్వ నిధులతో వేసిన సిమెంట్ రోడ్డును తొలగించారు. తమకు ఎదురేలేదు అనుకున్నారో ఏమో విశాఖ జిల్లా ఆనందపురం మండలం భీమందొరపాలెంలో చోటా నాయకుని కుటుంబీకులు.. రాత్రికి రాత్రే ప్రొక్లెయినర్​తో సిమెంటు రోడ్డు పెకలించి, పెచ్చులను గ్రామ రహదారికి ఇరువైపులా పడేసారు. 2017 - 18 ఆర్ధిక సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో 152 మీటర్ల సీసీ రహదారిని ప్రభుత్వ 5 లక్షల వ్యయంతో వేయించింది. అయితే తమ ఇంటికి వాస్తు దోషం ఉందంటూ ఓ చోటా నాయకుడు కుటుంబీకులు రోడ్డును యంత్రాలతో పెకిలించి చదునుచేశారు.

రైతులు పొలాలకు వెళ్లడానికి, పశువులకు అనువుగా ఉండే రహదారిలో అకస్మాత్తుగా కొంత రహదారి మాయమవటంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. పంచాయతీ కార్యాలయం తీసేయడంతో దూరంలో సచివాలయానికి సమాచారం అందించ లేకపోయామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి బయపడి ఫిర్యాదు చేయలేదని గ్రామస్థులు వాపోతున్నారు.

రామవరం సచివాలయ పరిధిలో ఉంది భీమందొరపాలెం. సచివాలయం పరిధిలో ప్రస్తుతం 11 నుంచి 15 మంది వరకు ఉద్యోగులతోపాటు ప్రతీ 50 కుటుంబాలకు ఓ వలంటీరు చొప్పున అనేక మందిని ప్రభుత్వం నియమించింది. వేతనాలు, గౌరవవేతనాలు పేరిట కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ప్రభుత్వ నిధులు వెచ్చించి నిర్మించిన సిమెంట్ రహదారిని పరిరక్షించకపోవడం పలువిమర్శలకు తావిస్తోంది.

ఇదే విషయమై సచివాలయం కార్యదర్శిని వివరణ కోరగా సిమెంట్ రహదారి తొలగింపు తమ దృష్టికి రాలేదని.. విచారణ జరిపి చర్యలు చేపడతామన్నారు. చోటా నాయకుని బందువుల వద్ద విషయం ప్రస్తావించగా.. వాస్తుదోషంతో సిమెంట్ రోడ్డులో కొంతభాగాన్ని తొలగించినట్లు తెలిపారు. తమకు చెందిన జిరాయితీ భూమిలో రహదారిని వేయించుకున్నామన్నారు. వాస్తుదోషం కారణంగానే అధికారులు అనుమతిలేకుండానే తొలగించినట్లు పేర్కొన్నారు.

ప్రజలు మాత్రం రోడ్డును తొలగించిన వారితోనే మరల రోడ్డు వేయించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి...

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరవండి : జీవీఎంసీ కమిషనర్

ABOUT THE AUTHOR

...view details