ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏసీబీ వలలో విద్యుత్తు శాఖ ఏఈ.. 70 వేలు తీసుకుంటుండగా అరెస్ట్​ - లంచాధికారి అరెస్ట్​

విశాఖ జిల్లా చిట్టివలస సెక్షన్ ఏఈ రమణను ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. మీటర్లుకు కనెక్షన్ ఇచ్చేెందుకు లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో దాడి చేసి పట్టుకున్నారు.

acb arrested corrupt officer in electricity department in visakapatnam district
ఏసీబీ వలలో విద్యుత్తు శాఖ ఏఈ.. 70 వేలు తీసుకుంటుండగా అరెస్ట్​

By

Published : Feb 4, 2021, 10:51 PM IST

లంచం తీసుకుంటూ ఏపీఈపీడీసీఎల్‌ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్. వి. రమణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విశాఖ జిల్లా చిట్టివలస సెక్షన్ ఏఈ రమణ సంగివలసలో ఓ అపార్ట్​మెంట్​కు 6 కొత్త విద్యుత్ మీటర్లకు కనెక్షన్​ ఇచ్చేందుకు 70 వేలు లంచం డిమాండ్ చేసారు. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని అపార్టుమెంట్ యజమాని ఎం.రామారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

లంచాధికారిని పట్టుకునేందుకు వలపన్నిన ఏసీబీ.. ఇవాళ చిట్టివలస విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రంగరాజు అధ్వర్యంలో దాడి​ చేశారు. బాధితుడు రామారావు నుండి 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ రమణను పట్టుకున్నారు. డబ్బుతో పాటు సంబంధిత రికార్డును అధికారులు స్వాధీనంచేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం!

ABOUT THE AUTHOR

...view details