ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోవాడ షుగర్స్​లో విద్యుదాఘాతం.. కాలిబూడిదైన పంచదార - fire accident in gowada sugar Factory news today

విశాఖ జిల్లాలోని గోవాడ చక్కెర కర్మాగారంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో రూ.4 లక్షల మేర ఆస్థి నష్ట ఏర్పడిందని కర్మాగార అధికార వర్గాలు వెల్లడించాయి. కర్మాగారంలో ఉన్న పంచదారను నిల్వ చేసే గోదాంల్లోని రెండో యూనిట్​లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది.

గోవాడ షుగర్స్ లో విద్యుదాఘాతం.. కాలిబూడిదైన పంచదార
గోవాడ షుగర్స్ లో విద్యుదాఘాతం.. కాలిబూడిదైన పంచదార

By

Published : Nov 13, 2020, 8:07 PM IST

విశాఖ జిల్లాలోని గోవాడ చక్కెర కర్మాగారంలో విద్యుత్ ప్రమాదం సంభవించింది. ఫలితంగా పంచదార బస్తాలపై నల్లటి టార్ఫలిన్ మీద నిప్పు అంటుకుని పంచదార బస్తాల సంచులన్నీ కాలి బూడిదయ్యాయి. కాలిన బస్తాల నుంచి చక్కెర బయట పడింది. ఫలితంగా రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని యాజమాన్యం స్పష్టం చేసింది.

అధికారులతో కలిసి డైరెక్టర్ పరిశీలన..

సమాచారం అందుకున్న వెంటనే కర్మాగారం యాజమాన్య సంచాలకుడు వి.సన్యాసినాయుడు అధికారులతో కలిసి ప్రమాద స్థలాలను పరిశీలించారు. పంచదారపాడైన నేపథ్యంలో బీమా అధికారులతో మాట్లాడుతున్నట్లు యాజమాన్య సంచాలకుడు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి

ABOUT THE AUTHOR

...view details