పురపాలక ఎన్నికల నియమావళిని తప్పక అనుసరించాల్సిన అవసరం ఉందని.. విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆమె ప్రసగించారు. డబ్బు, మద్యం పంపిణీ వంటివి పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళికి లోబడే మద్యం విక్రయాలు నిలపివేయాలన్నారు. ప్రధానంగా పోటీ చేసే అభ్యర్థులు ప్రార్థన మందిరాలు, దేవాలయాలు ఇతర ఆలయాల్లో ప్రచారం నిర్వహించకూడదని చెప్పారు. ఈ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
'ఎన్నికల నియమావళిని అందరూ పాటించాల్సిందే' - విశాఖపట్నం జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక ఎన్నికల నేపథ్యంలో... పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన శిక్షణ తరగతుల్లో సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ప్రసగించారు. సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు.
ఎన్నికల నియమావళిని అనుసరించాల్సిందే..