ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో జోరుగా సాగిన ఎన్నికల ప్రచారం - జనసేన

జిల్లాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇంటింటికీ వెళ్లి కొందరు, ప్రచార రథాలపై మరికొందరు. రోడ్​షో లతో ఇంకొందరూ ప్రచారం చేసుకుంటున్నారు. ఓటరు దేవుళ్ళను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఎన్నికల ప్రచారం

By

Published : Mar 27, 2019, 6:12 AM IST

ఎన్నికల ప్రచారం



విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా భారీ ర్యాలీ చేపట్టారు. దుర్గా గణపతి కూడలి నుంచి సాయిబాబా మందిరం వరకూ రోడ్ షో సాగింది. పెద్ద సంఖ్యలో తెలుగు మహిళా కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందనీ... సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలనీ విజ్ఞప్తి చేశారు.
విశాఖ జిల్లా భీమిలి తెదేపా అసెంబ్లీ అభ్యర్థి సబ్బం హరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వననీ... అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెదేపా చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు.
విశాఖ దక్షిణ వైకాపా అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తన తండ్రి నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న ప్రచార రథంపై పర్యటిస్తూ పలుచోట్ల ప్రసంగించారు. జగన్ పిలుపు మేరకు తాను వైకాపాలో చేరాననీ.. తనకు సీటు కేటాయించినందుకు అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. వైకాపాతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని తెలిపారు.
విశాఖ జిల్లా పాడేరు నుంచి జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి పి. బాలరాజు కొత్తవీధిలో విస్తృత ప్రచారం చేశారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంత్రిగా తన హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాననీ.. ఈసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details