విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధిలో నాలుగు వార్డులకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆర్డీవో పి. కిశోర్ తెలిపారు. నాలుగు వార్డులకుగాను 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 60,934 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. 750 మంది సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం నియమించమన్నారు. 43 అతి సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భీమునిపట్నం పురపోరుకు సర్వం సిద్ధం - bheemunipatnam election updates
విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధిలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగు వార్డులకుగాను 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆర్డీవో పి. కిశోర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 750 మంది సిబ్బందిని నియమించామన్నారు.
భీమునిపట్నం పురపోరుకు సర్వం సిద్ధం