ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నతనం నుంచీ చిన్నచూపే.. తట్టుకోలేకే హత్య చేశా..! - విశాఖ జిల్లా పూడిమడకలో హత్య వార్తలు

వారిద్దరూ ఒకే పేగు తెంచుకుని పుట్టారు. కానీ, తల్లిదండ్రులు తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తున్నారని.. తనకంటే ముందు తన తమ్ముడికి పెళ్లి చేస్తున్నారని మనస్తాపానికి గురయ్యాడు. పెళ్లి చూపుల్లో తనను చూసిన అమ్మాయి.. తన తమ్ముడిని పెళ్లిచేసుకుంటాననటంతో మరింత కుంగిపోయాడు. ఇవ్వన్నీ మనస్సులో పెట్టుకున్న అన్న.. తన తోడబుట్టిన తమ్ముడినే హతమార్చిన ఘటన.. విశాఖ జిల్లా పూడిమడక శివారు జాలారిపాలెంలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

culprit arrest
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

By

Published : Apr 7, 2021, 10:15 AM IST

విశాఖలోని పూడిమడకకు చెందిన మడ్డు యర్రయ్య (23).. తన అన్న రాజు చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న రాజును అచ్యుతాపురం ఎస్సై లక్ష్మణరావు సిబ్బందితో కలిసి అరెస్టు చేసి.. ఎలమంచిలి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు పోలీసు స్టేషన్‌లో హత్య కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు.

‘ఒకే పేగు తెంచుకు పుట్టినా.. చిన్నతనం నుంచీ తల్లిదండ్రులు చిన్నచూపు చూడటం తట్టుకోలేకపోయా. తనకు జీవిత భాగస్వామి కావాల్సిన యువతి తమ్ముడికి భార్యగా మారుతుండటంతో ఆక్రోషం కట్టలు తెంచుకుంది. పెళ్లిచూపులు నీతో.. పెళ్లి తమ్ముడితోనా అంటూ గ్రామంలో కొందరు హేళనగా మాట్లాడటంతో మరింత రగిలిపోయా. ఇంట్లో పెద్ద వాడికి కాకుండా చిన్న వాడికి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తుండటం, ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌ పోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరం కొట్టుకున్నాం. పదునైన ఇనుప ఆయుధంతో తమ్ముడి కంఠం పక్కగా పొడిచేశా’నని హత్య కేసులో నిందితుడైన అన్న పోలీసుల విచారణలో వెల్లడించాడని ఎలమంచిలి సీఐ నారాయణరావు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details