అన్నదమ్ముల మధ్య చెలరేగిన వివాదం.. చివరికి తమ్ముడి ప్రాణాలు తీసింది. విశాఖ జిల్లా పూడిమడక శివారు జాలారిపాలెంలో సొంత తమ్ముడిని అన్నయ్యే హత్య చేశాడు. రాజు, ఎర్రమ్మల పెద్ద కుమారుడు రాజేష్, చిన్నకుమారుడు ఎర్రయ్య. 3 నెలల క్రితం రాజేష్‌కు పెళ్లి సంబంధం రాగా... ఆ అమ్మాయిని ఎర్రయ్య ఇష్టపడ్డాడు. దీంతో తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. ఎర్రయ్యను ఎలాగైనా కడతేర్చాలని చూశాడు. పగతో రగిలిపోతున్న అన్నయ్య సమయం చూసి తమ్ముడిని కత్తితో పొడిచాడు.
పెళ్లి సంబంధ వివాదం.. తమ్ముడిని చంపిన అన్న - ఈరోజు విశాఖ జిల్లా క్రైమ్ అప్ డేట్స్
తోడ బుట్టిన తమ్ముడిని.. అన్నయ్య కత్తితో పొడిచి చంపిన ఘటన విశాఖ జిల్లాలోని జాలారిపాలెంలో చోటు చేసుకుంది. పెళ్లి సంబంధం విషయంలో అన్న పెంచుకున్న కోపం హత్యకు దారి తీసిందని పోలీసులు వెల్లడించారు.
తమ్ముడిని కత్తితో పొడిచి హత్య
కొనఊపిరితో ఉన్న ఎర్రయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి...