ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఎలక్ట్రికల్ మీటర్​ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి"

ప్రభుత్వం, డిస్కంలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని...యునైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు విశాఖలో డిమాండ్ చేశారు.

మీటర్​ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ...ఆందోళన చేస్తోన్న యూఈసీడబ్ల్యూయూ నాయకులు

By

Published : Aug 28, 2019, 6:06 PM IST

మీటర్​ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ యూఈసీడబ్ల్యూయూ నాయకుల ఆందోళన

ఎలక్ట్రికల్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని... ఏపీ ఈపీడీసీఎల్ మీటర్ రీడర్స్ మహాసభ విశాఖలో డిమాండ్ చేసింది. కాంట్రాక్టు విధానం వల్ల ప్రభుత్వానికి, డిస్కంలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మీటర్ రీడర్స్ నష్టపోతున్నారని... యునైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, వినియోగదారులకు అనుసంధానకర్తగా పనిచేస్తూ... ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మీటర్ రీడర్స్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వాపోయారు. కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల వల్ల మీటర్ రీడర్స్ నష్టపోతున్నారని... వారికి న్యాయం చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే అసెంబ్లీలో అన్నారని గుర్తుచేశారు. పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి, నెల వారి జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని మీటర్ రీడర్స్ మహాసభ కోరింది.

ABOUT THE AUTHOR

...view details