విశాఖ జిల్లా ఎలమంచిలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. చికెన్ సెంటర్ వద్ద భారీ సంఖ్యలో జనాలు బారులు తీరారు. అనేక ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు మధ్య ప్రజలు సరుకులు కొనుగోలు చేశారు. అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని స్థానిక మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. దుకాణాలను దూరం దూరంగా ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్థులకు సూచించారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుండే కరోనా ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
జనాలతో కిటకిటలాడిన ఎలమంచిలి కూరగాయల మార్కెట్ - lockdown on people
విశాఖ జిల్లా ఎలమంచిలిలో ప్రజలు సామాజిక దూరంపై అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు. కూరగాయల మార్కెట్ లో గుమిగూడుతూ కొనుగోళ్లు చేశారు.
జనాలతో కిటకిటలాడిన ఎలమంచిలి కూరగాయల మార్కెట్