ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీహార్​కు తరలిస్తుండగా... 18 కిలోల గంజాయి పట్టివేత - ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టివేత

విశాఖ ఏజెన్సీ నుంచి బీహార్​కు తరలిస్తున్న 18 కిలోల గంజాయిని అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

ganja seized in anakapalli
గంజాయి తరలింపు

By

Published : Mar 24, 2021, 3:52 PM IST

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి బీహార్​కు తరలిస్తున్న గంజాయిని అనకాపల్లి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి బీహార్​కు సరఫరా చేస్తున్న ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు అనకాపల్లి పట్టణ ఎస్సై రామకృష్ణ తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతంలోని ఓ వ్యక్తి నుంచి గంజాయిని తీసుకున్నామని.. బీహార్​లోని పాట్నాకు చెందిన రాజుషా, విశాల్ కుమార్​షా అంగీకరించారన్నారు. వీరి నుంచి 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని.. నిందితులతో ఉన్న ఆరేళ్ల బాలుడిని చైల్డ్ హోమ్​కి తరలించామని చెప్పారు. అసలైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నామన్నారు.

బస్సులో తరలిస్తున్న గంజాయి పట్టివేత..

విశాఖ నుంచి కర్నూలుకి తరలిస్తున్న 12 కిలోల గంజాయిని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. విశాఖ నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా 12 కిలోల గంజాయిని గుర్తించారు. విశాఖ జిల్లా చింతపల్లి నుంచి ఆ ఇద్దరు.. గిద్దలూరులో గంజాయి విక్రయించేందుకు వెళ్తున్నట్లు తేల్చారు. వీరు గతంలోనూ గంజాయిని విక్రయించినట్లు ఒప్పుకొన్నారని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

కుమ్మరిపుట్టు పొదల్లో దొరికిన పసికందు

ABOUT THE AUTHOR

...view details