విశాఖపట్నం కేజీహెచ్‌లో వైద్యుడిపై దాడి చేసిన ఘటనలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు హార్బర్ జోన్ ఏసీపీ శిరీష తెలిపారు. నిందితులందరూ నేరప్రవృత్తి కలిగి ఉన్న వారేనని వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్యామ్ అనే యువకుడి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసినందుకే వైద్యుడిపై దాడి చేసినట్లు ఏసీపీ వివరించారు.
కేజీహెచ్‌లో వైద్యుడిపై దాడి ఘటన..ఎనిమిది మంది అరెస్టు - vizag kgh
విశాఖ కేజీహెచ్‌లో వైద్యుడిపై దాడికి ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. శ్యామ్ అనే యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం చేసినందుకే నిందితులు ఈ దాడికి పాల్పడ్డారని హార్బర్ జోన్ ఏసీపీ శిరీష తెలిపారు.
police case
నిందితులపై సెక్షన్ 307, 332, 353, 324, 323 r/34 ఏపీ మెడికేర్ సర్వీస్ పర్సన్, ఇన్స్టిట్యూట్ యాక్ట్ సెక్షన్-4 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా అత్యయిక పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యుడిపై దాడి చేయడం బాధాకరమని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ శిరీష హెచ్చరించారు.
ఇదీచదవండి.
'ఆనందయ్య ఔషధాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తితిదే సిద్ధం'
Last Updated : May 26, 2021, 7:45 PM IST