ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగు నెలలు.. ఎనిమిది కిలోమీటర్లు

ఎవ‌రో వ‌స్తార‌ని... ఏదో చే‌స్తార‌ని.. ఎదురు చూడ‌కుండా శ్ర‌మ‌ను నమ్ముకొని ఏకంగా ఎనిమిది కిలో మీటర్లు రహదారి నిర్మించుకున్నారు. అధికారుల‌కు ఎన్నిసార్లు మొర ‌పెట్టుకున్న‌ప్ప‌టికీ వారిలో ఎలాంటి స్పంద‌న లేని కారణంగా.. గిరిజనులే స్వయంగా ముందుకొచ్చారు. శ్రమదానంతో.. మార్గం వెతుకున్నారు. సమస్య పరిష్కరించుకున్నారు.

road build by the tribes
శ్రమదానంతో రోడ్డును నిర్మించిన గిరిజనులు

By

Published : Nov 5, 2020, 5:16 PM IST

విశాఖ జిల్లా చోడవరం, పాడేరు నియోజకవర్గాల శివారు గ్రామాలైన ఆదివాసీ గిరిజనులు నాలుగు నెలలు పాటు శ్ర‌మించి ఎనిమిది కిలోమీటర్ల ర‌హ‌దారిని నిర్మించుకున్నారు. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపించారు. కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ జాజులబంద, పిత్రి గడ్డకు చెందిన గిరిపుత్రులు ఈ ఘనత సాధించి ఆదర్శంగా నిలిచారు. వారు.. ఇన్నాళ్లూ నిత్యావసర సరకులు తెచ్చుకోవాలన్నా కూడా... 25 కిలో మీటర్లు ప్రయాణం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై.. ఎంత మంది అధికారులను కలిసి తమ గోడు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడం.. గ్రామస్థులను ఆలోచింపజేసింది. చివరికి అంతా ఒక్కటయ్యేలా చేసింది. రంగంలోకి దిగిన 2 గ్రామాలకు చెందిన 150 మంది గిరిజనులు.. చేయీ చేయీ కలిపి కొండలను పిండి చేశారు. ఏకంగా 8 కిలోమీటర్ల రహదారిని నిర్మించి శభాష్ అనిపించుకున్నారు.

కోందుతెగకు చెందిన గిరిజనులు.. కొయ్యూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అలాగే పంచాయతీ కేంద్రానికి వెళ్లాలన్నా, రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా కూడా 25 కిలో మీటర్ల వెళ్లాల్సి ఉంది. దీంతో ముందు తరాలు మరిన్ని ఇబ్బందులు ఎదురుకోక తప్పదని భావించిన వారు గ్రామ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తామే సంకల్పించి రోడ్డును నిర్మించుకోవాలని తీర్మానించుకున్నారు. అనుకున్నదే తడువుగా నాలుగు నెలల్లో 8 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం చేశారు. ప్రభుత్వాలు మారినా... దశాబ్దాలుగా తమ సమస్య మాత్రం మారలేదని.. అందుకే ఇంతటి శ్రమకోర్చామని వారు చెప్పారు.

ఇవీ చూడండి:

'ఖర్చు తగ్గినా... రుసుములు ఎందుకు?'

ABOUT THE AUTHOR

...view details