విశాఖలోని యారాడ బీచ్లో 8 అడుగుల కొండచిలువ సంచారం కలకలం రేపింది. సందర్శకులు స్నానాలు చేస్తున్న సమయంలో.. హఠాత్తుగా ప్రత్యక్షమవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలలతో పాటు తిరిగి సముద్రంలోకి వెళ్లిపోవడంతో.. బీచ్లో స్నానానికి సందర్శకులు వెనకడుగు వేశారు.
యారాడ బీచ్లో కొండచిలువ కలకలం - tourists fear about python found at yarada beach
విశాఖ జిల్లా యారాడ బీచ్లో స్నానం చేస్తున్న సందర్శకులకు అనుకోని అతిథి కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఎనిమిదడుగుల కొండ చిలువ కలకలం సృష్టించింది. ఈ ఘటనతో బీచ్లో దిగడానికి ప్రజలు ముందుకు రాలేదు.
![యారాడ బీచ్లో కొండచిలువ కలకలం python at yarada beach](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9523230-77-9523230-1605176197207.jpg)
యారడ బీచ్లో కొండచిలువ కలకలం