విశాఖ నగరంలో 'ఈనాడు' మెగా ప్రాపర్టీ షో నిర్వహించారు. అనేక స్థిరాస్తి రంగ సంస్థల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. ఫ్లాట్లు, విల్లాలు, నివాస స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారి కోసం... వివిధ స్థిరాస్తి సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఆకర్షణీయ ఆఫర్లతో పాటు... స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. వివిధ బ్యాంక్లు కస్టమర్లకు లోన్ సదుపాయాలు అందించేందుకు ముందుకొచ్చాయి.
'ఈనాడు' ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ షో - ఈనాడు ప్రాపర్టీ షో తాజా న్యూస్
విశాఖలో 'ఈనాడు' మెగా ప్రాపర్టీ షో నిర్వహించారు. అనేక స్థిరాస్తి రంగ సంస్థల్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చింది 'ఈనాడు'. బీచ్ రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్లో 2 రోజులపాటు నిర్వహించనున్న మెగా ప్రాపర్టీ షోను.. విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు ప్రారంభించారు.
'eenadu' mega property show in visakhapatnam