ఈనాడు, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్యవరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్ వ్యాధి రావటానికి గల ముఖ్య కారణాలు, తొలిదశ గుర్తింపు, రొమ్ము క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, నోరు, గొంతు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. రేడియో థెరపీ, కీమోథెరపీ చికిత్సల గురించిన అపోహలు తొలగించారు. మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు సదస్సులో పాల్గొని ఈ వ్యాధిపై సందేహాలను నివృత్తి చేశారు.
ఈనాడు ఆధ్వర్యంలో విశాఖలో క్యాన్సర్‌పై అవగాహన సదస్సు - విశాఖలో క్యాన్సర్‌పై అవగాహన తాజా వార్తలు
క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించేందుకు ఈనాడు, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో అవగాహన సదస్సు నిర్వహించారు. రేడియో థెరపీ, కీమో థెరపీ చికిత్సలపై ఉన్న అపోహలను తొలగించారు.
ఈనాడు ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన సదస్సు