ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వసతులు లేక.. బీఎడ్‌ కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థుల అవస్థలు - బీఎడ్‌ కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థుల అవస్థలు తాజా వార్తలు

బీఎడ్‌ కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కౌన్సెలింగ్ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. చంటి పిల్లల తల్లులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Edcet Verification
Edcet Verification

By

Published : Feb 27, 2021, 10:30 AM IST

బీఎడ్‌ కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థుల అవస్థలు

బీఎడ్‌లో ప్రవేశాల కోసం విశాఖలో కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు.. నానా అవస్థలు పడాల్సి వస్తోంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే కౌన్సెలింగ్‌కు మొదటి రోజు ఒకటో ర్యాంక్‌ నుంచి 4 వేల ర్యాంకు వరకు అభ్యర్థులను పిలిచారు. పరిశీలన జరిగే ఆంధ్రా విశ్వ విద్యాలయం టెక్నికల్ సెంటర్‌కు వివిధ జిల్లాలు నుంచి విద్యార్థులు వచ్చారు.

ఉదయం నుంచి రాత్రి వరకు.. కేవలం 800 మంది ధ్రువపత్రాలను మాత్రమే పరిశీలించారు. ఉదయం నుంచి ఎండ వేడి, సరైన సౌకర్యాలు లేకపోవడం, ఖచ్చితంగా సమాచారం లేని పరిస్థితుల్లో.. కౌన్సెలింగ్‌కు వచ్చిన గర్భిణులు, చంటి పిల్లల తల్లులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details