ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖలు విడుదల - visakha latest news

భారత సీపీఐ మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలంటూ... మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కమిటీ, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ పేరుమీద రెండు లేఖలు వెలిశాయి. మన్యంలో ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది.

East Zone Maoist Committee release Letters
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖలు విడుదల

By

Published : Sep 18, 2020, 9:12 AM IST

విశాఖ మన్యంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ, భారత సీపీఐ మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.

సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు మన పార్టీ 16వ వార్షికోత్సన్ని విప్లవో త్సాహంతో జరుపుకుందాం. విప్లవోద్యమంపై ఫాసిస్ట్ పాలకవర్గాలు కొనసాగిస్తున్న సమాధాన్ దాడినీ ధృఢ సంకల్పంతో తిప్పికొడదాం. ప్రజాయుద్ధం ద్వారా సాధించుకున్న విప్లవ విజయాలను కాపాడుకుందాం. దీర్ఘకాలిక ప్రజాయుద్ధం పంథాలో పురోగామిద్ధాం. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దాం. సెప్టెంబర్ 13న కామ్రేడ్ జితిన్​దాస్ వర్ధంతిని రాజకీయ ఖైదీల హక్కుల పోరాట దినంగా జరుపుకుందాం. రాజకీయ ఖైదీల పోరాటానికి మద్దతునిద్దాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడి జైలులో ఖైదీల హక్కులకు కోసం 64 రోజులు నిరాహారదీక్ష జరిపి సెప్టెంబర్ 13న అమరుడైన కా.జితిన్ దాస్​ను స్మరించుకుందాం. హక్కుల ఉద్యమకారులు వరవరరావు, అరుణ్ పేరేరా, సూదభారద్వజ్, గౌతమ్ నావల్క్ వెర్నాన్ , గొంజల్వేన్ సాయిబాబాలతో పాటు.. దేశవ్యాప్తంగా జైళ్లలో నిర్బంధించిన రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి. విశాఖ ఈస్ట్ డివిజన్​లో గాలికొండ, కోరుకొండ, పెదబయలులో ఈ మధ్య కాలంలో అక్రమంగా అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలి. అని మావోయిస్టు పోస్టర్లలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details