ఈస్ట్ కోస్ట్ రైల్వే : సరకు రవాణాలో రికార్డ్ ఆదాయం అర్జన 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 205 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసిన తూర్పు కోస్తా రైల్వే.. మిగిలిన జోన్లను అధిగమించి రికార్డు సృష్టించింది. సరకు రవాణా రికార్డులో వాల్తేర్, ఖుర్డా రోడ్, సంబల్ పూర్ డివిజన్లు కీలక పాత్ర వహించాయి.
అత్యధిక ఆదాయం సంపాదించిన జోన్..
భారతీయ రైల్వేల్లో 47.32 శాతం ఆదాయంతో తూర్పు కోస్తా రైల్వే జోన్ కొత్త రికార్డును నమోదు చేసింది. అత్యధిక ఆదాయం సంపాదించిన జోన్‌గా భారతీయ రైల్వేలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. అంకితభావం, సిబ్బంది సహకారంతోనే ఈ ఘనత పొందగలిగామని ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ విద్యా భూషణ్ తెలిపారు. సిబ్బంది కృషిని అభినందిస్తూ కొనియాడారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సరకు రవాణా రికార్డు నిలకొల్పి, అత్యధిక అదాయాన్ని ఆర్జించినట్లు చెప్పారు.
ఇవీ చూడండి:
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ!