తూర్పుకోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం సహకారంతో వాల్తేర్ డివిజన్లో ఈ-వాహనాలను సరకు రవాణా కోసం వినియోగిస్తామని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో వాల్తేరు డీ.ఆర్.ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ, తూర్పు కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు షాలిని శ్రీవాస్తవ నాలుగు ఈ-వాహనాలను ప్రారంభించారు. పర్యావరణ హితమైన వీటిని ఉపయోగించడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం సిబ్బంది అవసరాల కోసం డివిజన్లో యాభైకి పైగా అద్దె వాహనాలను ఉపయోగిస్తున్నామని.. ఏటా ఒక్కో వాహనానికి రూ.8,43,000 ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. దాదాపు రెండు లక్షల రూపాయలతో ఈ-వాహనాన్ని కొనుగోలు చేస్తే రూ.34,000 వేల రూపాయలకే ఏడాది పాటు వినియోగించుకోవచ్చని వెల్లడించారు.