విశాఖ జిల్లాలోని సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా చిలుకు ద్వాదశి ఉత్సవం నిర్వహించారు. ఏటా కార్తిక మాసంలో ద్వాదశినాడు ఈ కార్యక్రమం చేయటం ఆనవాయితీ. స్వామివారి సన్నిధిలో చెరుకు గడలతో రోలులో దంచి.. ప్రసాదాన్ని తయారు చేసి నివేదిస్తారు. ఇందులో భాగంగా అర్చకులు పారాయణం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో చిలుకు ద్వాదశి ఉత్సవం - simhadri appanna news
కార్తిక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. సింహాచలం సింహాద్రి అప్పన్న గుడిలో ద్వాదశి ఉత్సవం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది.
సింహాద్రిలో ద్వాదశి ఉత్సవం