లాక్ డౌన్ కారణంగా సింహాద్రి అప్పన్న ఆలయానికి భక్తులు రాకపోవడంతో ఆదాయం రావడం లేదు. ఈ సమయంలోనే స్వామివారి ప్రధాన ఉత్సవాలు, చందనోత్సవం, గంధం అమావాస్య, కళ్యాణం వంటివి ఏకాంతంగానే అర్చక స్వాములు నిర్వహించారు. చందన యాత్ర ఒక్క రోజునే గత ఏడాది నాలుగు కోట్ల రూపాయల ఆదాయం స్వామివారి ఖజానాకు చేరింది. లాక్ డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకే స్వామి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.
లాక్ డౌన్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన అప్పన్న హుండీ ఆదాయం - lockdown effcet on simhadri appanna temple
కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. భక్తుల రాక పూర్తిగా నిలిచిపోవటంతో ఆదాయం భారీగా తగ్గింది. అర్చకులే అన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఆలయంలోనూ హుండీ ఆదాయం భారీగా తగ్గినట్లు అధికారులు తెలిపారు.

due to lockdown vizkha dst sihadri appana temple hundi income decreased
TAGGED:
corona news in vizag