విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో పోలీసులు.. నిరంతరం నిఘా పెడుతున్నారు. అనవసరంగా రహదారులపై తిరిగే వారిని గుర్తించి కేసులు నమోదుచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిస్తే యజమానులపై కేసులు పెడుతున్నారు. వాహనాలనూ స్వాధీనం చేసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి.. తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
లాక్డౌన్ : డ్రోన్ కెమెరాలతో నిఘా - అనకపల్లిలో డ్రోన్ కెమెరాతో నిఘా
కరోనా ప్రభలకుండా అనకాపల్లి పట్టణ పరిధిలోని నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాలని పోలీసులు పహారా కాస్తున్నారు. నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.
due to lockdown Surveillance with drone camera at Anacapalli in visakha