లాక్ డౌన్లో భాగంగా గత కొన్ని రోజులుగా అనకాపల్లిలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం జన సంచారంతో ఉండే నెహ్రూ చౌక్ కూడలి, పూడిమడక రోడ్డు, చోడవరం రోడ్డు, అనకాపల్లి ప్రధాన రహదారి, రింగ్ రోడ్డు ప్రాంతాలు నిశ్శబ్దంగా మారాయి. గత కొద్ది రోజులుగా దుకాణాలు తెరవని కారణంగా.. ప్రధాన రహదారి బోసిపోయింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు.
బోసిపోయిన రోడ్లు... ఇంటికే పరిమితమైన ప్రజలు - విశాఖ జిల్లాలో లాక్డౌన్ వార్తలు
విశాఖ జిల్లా అనకాపల్లిలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ మేరకు నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి.
due to lockdown no vechicles in anakapalli, visakhapatnam