ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాజువాకలో రోడ్డెక్కిన వలస కూలీలు

లాక్​డౌన్ కారణంగా ఎన్నో చోట్ల వలస కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు గాజువాకలోని వేలాది మంది వలస కార్మికులు ఆందోళనకు దిగారు. రోడ్లపైకి చేరి తమ సొంత రాష్ట్రాలకు పంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

due to corona lockdown Migratory laborers protest for salaries at gajuwaka in visakhapatnam
due to corona lockdown Migratory laborers protest for salaries at gajuwaka in visakhapatnam

By

Published : May 6, 2020, 4:32 PM IST

విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో వేలాది మంది వలస కార్మికులు రోడ్డెక్కారు. హెచ్​పీసీఎల్, ఎల్ అండ్ టీ.. వంటి సంస్థల్లో పనిచేస్తున్న కూలీలు... తమను సొంత రాష్ట్రాలకు పంపాలంటూ ఆందోళనకు దిగారు. వలస కార్మికులతో గంగవరం పోర్టు రహదారి నిండిపోయింది.

వలస కార్మికులకు నచ్చజెప్పేందుకు గుత్తేదారులతో.. హార్బర్ ఏసీపీ మోహనరావు చర్చలు జరుపుతున్నారు. తమకు రెండు నెలలుగా జీతాలు లేవని, స్వస్థలాలకు పంపాలని బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు డిమాండ్ చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details