విశాఖలో స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. పేదలు, వలస కూలీలకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వన్‌టౌన్ ప్రాంతంలో సుమారు రెండు వేల మందికి వ్యక్తిగత దూరం పాటిస్తూ.. ఆహారం అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని.. గత 40 రోజులుగా ఆహారం అందిస్తున్నట్లు వారు తెలిపారు. లాక్డౌన్ ఉన్నంత కాలం ఈ సహాయం అందిస్తానని వివేకానంద సేవా సంస్థ అధ్యక్షుడు సురాడ అప్పారావు తెలిపారు.
విశాఖలో పేదలకు ఆహారం అందించిన వివేకానంద సేవా సంస్థ - విశాఖలో లాక్డౌన్ వార్తలు
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. విశాఖలో పేదలు, వలస కూలీలకు స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆహారం పంపిణీ చేశారు.

due to corona lockdown Distribution of food by swamiVivekananda charity at visakhapatnam