కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెరిచిన షాపింగ్ మాల్స్‌ని జీవీఎంసీ అధికారులు దగ్గరుండి మూసివేయించారు. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈనెల 31 వరకూ షాపింగ్ మాల్స్ తెరవకుండా వ్యాపారులు సహకరించాలని కోరారు.
కరోనా ప్రభావం: అనకాపల్లిలో షాపింగ్ మాల్స్ మూసివేత - latest news of corona in visakha
కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాపారులు తమ వంతు సహకారాన్ని అందించాలని విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ మూర్తి తెలిపారు. కరోనా అరికట్టేందుకు ఈ నెల 31 వరకు షాపింగ్ మాల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు.
షాపింగ్ మాల్స్‌ను మూయించిన జీవీఎంసీ కమిషనర్