కరోనా సెకండ్ వేవ్ వస్తే.. లాక్ డౌన్ చేయాల్సిన పరిస్దితే ఏర్పడితే.. ముందుగానే వ్యాక్సిన్ వేసుకుని విధి నిర్వహణకు పోలీసులు ఎప్పుడూ సన్నద్దంగా ఉండాలని డీఎస్పీ అర్.పి.ఎల్. శాంతికుమార్ సూచించారు. విశాఖపట్నం కైలాసగిరి ఆర్మూడు రిజర్వ్ నందు పోలీసులకు ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన.. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత కూడా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరన్నారు. డాక్టర్ల సలహా మేరకు ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని.. అపోహాలు వీడాలని కోరారు. కాగా ఈ రోజు 430 మంది పోలీసులు కైలాసగిరి ఆర్మూడు రిజర్వ్ నందు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్, ఆర్ఐలు రామకృష్ణ, అరవింద్ కిశోర్, వెంకటరావు, మురళి మోహన్ రావు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసులకు కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ - పోలీసులకు కరోనా వ్యాక్సిన్ తాజా వార్తలు
విశాఖపట్నం కైలాసగిరి ఆర్మూడు రిజర్వ్ నందు పోలీసులకు ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని డీఎస్పీ అర్.పి.ఎల్. శాంతికుమార్ ప్రారంభించారు. సిబ్బందిలో స్పూర్తి నింపేందుకు తనే మొదటగా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
వ్యాక్సిన్ వేయించుకుంటున్న డీఎస్పీ