ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FIGHT: తాగేసి వాగాడు..చివరకు.. - vishaka updates

సహనాన్ని పరిక్షిస్తే.. సాధారణ స్త్రీ మూర్తి కూడా ఆదిపరాశక్తిగా మారుతుంది. ఆ సమయంలో ఎంతటి పురుషుడినైనా నిలువరించగలదు. ఈ పదాలను నిజం చేసి చూపింది ఓ మహిళ. తాగి వచ్చి.. తన షాపు ఎదుట గొడవ చేస్తున్న ఓ తాగుబోతుని చిత్తుగా కొట్టింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

పోట్లాట
FIGHT

By

Published : Aug 13, 2021, 2:03 PM IST

విశాఖ నగరంలోని ఆరిలోవలో ఓ వ్యక్తిని మహిళ చితకబాదిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. క్రాంతి నగర్​లోని ఓ దుకాణ యజమానురాలైన మహిళపై.. రామకృష్ణ అనే యువకుడు తాగి వచ్చి దుర్భాషలాడి చేయి చేసుకున్నాడు. సహనం కోల్పోయిన ఆ మహిళ తిరగబడి ఆ వ్యక్తిని చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.

తాగుబోతును చితకబాదిన మహిళ

ABOUT THE AUTHOR

...view details