ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న భారత కోస్ట్ గార్డు - visakha coast guard office news

భారత కోస్ట్ గార్డు సిబ్బంది భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని కోస్ట్ గార్డు అదనపు డైరక్టర్ జనరల్ కార్యాలయం సమాచారం వెల్లడించింది. మాదక ద్రవ్యాల రవాణా జరుగుతుందని సమాచారం అందుకున్న అధికారులు ఆపరేషన్​ నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

drugs seized
శ్రీలంక బోటు నుంచి మాదక ద్రవ్యాలు స్వాధీనం

By

Published : Nov 25, 2020, 8:58 PM IST

తమిళనాడులోని దక్షిణ తుత్తుకూడి వద్ద వంద కిలోల హెరాయిన్ శ్రీలంక బోట్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు భారత కోస్ట్ గార్డు వెల్లడించింది. బోటులో ఉన్న ఆరుగురు శ్రీలంక జాతీయులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపింది. దీనిపై విశాఖలోని కోస్ట్ గార్డు అదనపు డైరక్టర్ జనరల్ కార్యాలయం సమాచారం వెల్లడించింది. శ్రీలంక పడవలో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయన్న సమాచారం సేకరించిన కోస్ట్ గార్డు, దానిని పట్టుకునేందుకు తొమ్మిదిరోజుల పాటు ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.

పాకిస్తాన్ లోని కరాచీ నుంచి మాదక ద్రవ్యాలను మార్పిడి విధానంలో అందించారని శ్రీలంక జాతీయులు ప్రాథమిక విచారణలో చెప్పారని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్​ను పశ్చిమ దేశాలు, ఆస్ట్రేలియాకు చేరవేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. బోటు సిబ్బంది నుంచి 99 ప్యాకెట్ల హెరాయిన్, 20 చిన్న పెట్టెల్లో సింథటిక్ డ్రగ్స్, ఐదు 9ఎంఎం పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. శ్రీలంక బోట్​లోని ఖాళీ ఇంధన టాంకులో దాచి ఉంచిన డ్రగ్స్​ను భారత కోస్ట్ గార్డు గుర్తించిందన్నారు.

ఇదీ చదవండి: భారత్ చేతికి 'ప్రిడేటర్'​ డ్రోన్లు- చైనాతో సై!

ABOUT THE AUTHOR

...view details