ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెడికల్​ షాపు యాజమాని మృతికి ఔషధ నియంత్రణ అధికారుల నివాళి - Drug control officers in visakhapatnam district

విశాఖలో కరోనా సోకి మృతి చెందిన మయూరి మెడికల్స్ ప్రొప్రయిటర్ పోలాకి వెంకట రమణమూర్తి కుటుంబానికి పలువురు అధికారులు సంతాపం తెలిపారు. ఔషధ నియంత్రణ జాయింట్ డైరెక్టర్ ఎల్.ఏ.గోవిందం, అసిస్టెంట్ డైరెక్టర్ కె.రజిత, సిబ్బంది, విశాఖ కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బగ్గాం శ్రీనివాసరావు, జిల్లా సంఘం కోశాధికారి బెల్లాల సతీష్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.

medical shop owner dead with corona
మెడికల్​ షాపు యాజమాని మృతికి ఔషధ నియంత్రణ అధికారులు శ్రద్ధాంజలి

By

Published : Jul 1, 2020, 9:20 PM IST

విశాఖ రైల్వే న్యూకాలనీలో మయూరి మెడికల్స్ ప్రొప్రయిటర్ పోలాకి వెంకట రమణమూర్తి కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఔషధ నియంత్రణ అధికారులు జాయింట్ డైరెక్టర్ ఎల్.ఏ.గోవిందం, అసిస్టెంట్ డైరెక్టర్ కె.రజిత, సిబ్బంది, విశాఖ కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బగ్గాం శ్రీనివాసరావు, జిల్లా సంఘం కోశాధికారి బెల్లాల సతీష్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతి కెమిస్ట్ కోవిడ్-19 పోరాటంలో భాగంగా ప్రాణాలొడ్డి ప్రజలకు మందులు అందుబాటులో ఉండేలా పాటుపడుతున్నారని బగ్గాం శ్రీనివాసరావు అన్నారు. లాక్​డౌన్​ సమయంలో కూడా దేశ వ్యాప్తంగా కెమిస్ట్స్ అన్ని వేళలా సేవలందించారని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details