ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసంద్రంగా ద్రోణంరాజు శ్రీనివాస్ అంతిమయాత్ర - vizag news updates

మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మృతదేహానికి నేతలు, అనుచరులు నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ సదన్ నుంచి కాన్వెంట్ జంక్షన్ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది.

dronamraju srinivas funeral completed in vizag
ముగిసిన ద్రోణంరాజు శ్రీనివాస్ అంతిమయాత్ర

By

Published : Oct 5, 2020, 4:17 PM IST

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు భౌతిక కాయానికి ... రాజకీయ ప్రముఖులు, అభిమానులు, స్థానికులు నివాళులర్పించారు. డాక్టర్స్ కాలనీలోని రాజీవ్ సదన్ నుంచి అంతిమ యాత్ర సాగింది.

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విప్ కోన రఘుపతి, విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఈ యాత్రలో పాల్గొన్నారు. పూర్ణ మార్కెట్ నుంచి పేదవాల్తేరు మీదుగా... కాన్వెంట్ జంక్షన్ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు.

ద్రోణంరాజు శ్రీనివాస్ అంతిమయాత్ర

ABOUT THE AUTHOR

...view details