విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2016లో వీఎమ్ఆర్డీఏ చట్టం అమల్లోకి వచ్చాక తొలిసారిగా ఛైర్మన్ నియామకం జరిగింది. ఇంతవరకు ఈ సంస్ధకు ఉద్యోగ రీత్యా ఛైర్మన్ గా మునిసిపల్ శాఖ కార్యదర్శి వ్యవహరించారు. మెట్రోపాలిటన్ కమిషనర్‌గా బసంత్ కుమార్ బాధ్యతలను నిర్వర్తించేవారు. ఇటీవలే ఆయన టీటీడీ జెఈవోగా బదిలీపై వెళ్లారు. ఛైర్మన్ నియామకం జరగడంతో ఇతర డైరక్టర్ ల నియామకం కూడా త్వరలో జరుగుతుందన్న అశాభావంతో వైకాపా శ్రేణులు ఉన్నాయి.
వీఎంఆర్డీఏ చైర్మన్‌గా ద్రోణంరాజు
వైకాపాలో కీలక నేతలకు నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయి. ఈక్రమంలోనే వైకాపా సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ను విశాఖ మెట్రో ఆర్డీఏ చైర్మన్ పదవి వరించింది. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్ నియమితులయ్యారు. వైకాపా సీనియర్ నేత అయిన ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ద్రోణంరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు.
విశాఖ మెట్రో ఆర్డీఏ చైర్మన్‌గా ద్రోణంరాజు
Last Updated : Jul 13, 2019, 3:58 PM IST